NTTM: భారత టెక్స్ టైల్స్ రంగానికి మళ్లీ ఊపిరి 4 d ago

భారతదేశాన్ని టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగంలో అగ్రగామిగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ 2020లో ప్రారంభించిన నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్(NTTM) కి ఐదేళ్లు పూర్తి ప్రపంచవ్యాప్తంగా టెక్స్ టైల్స్ ఎగుమతుల్లో భారత్ 3.9శాతం వాటాతో 6వ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉంది. ఇది దేశ జీడీపీలో దాదాపు 2% దోహదం చేస్తుంది. 2030 నాటికి ఈ రంగం విలువ 350 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని, ఈ వృద్ధితో 3.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. టెక్నికల్ టెక్స్ టైల్స్ ను 12 కేటగిరీలుగా విభజించారు.
మెడీటెక్ లో డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, డిస్పోజబుల్స్, కాంటాక్ట్ లెన్స్, ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్లు. మొబైల్ టెక్ లో ఎయిర్ బ్యాగులు, హెల్మెట్లు, నైలాన్ టైర్ తీగలు, ఎయిర్ లైన్ డిస్పోజబుల్స్. ఓయికో టెక్ లో రీసైక్లింగ్, వ్యర్థాల తొలగింపు, పర్యావరణ పరిరక్షణ. ప్యాక్ టెక్ లో రాపింగ్ ఫాబ్రిక్స్, పాలియోలిఫిన్ వూవెన్ సాక్స్, లెనో బ్యాగ్స్, జనపనార సంచులు. ప్రో టెక్ లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అగ్ని నిరోధక దుస్తులు, అధిక దృశ్యమానత దుస్తులు. స్పోర్ట్ టెక్ లో స్పోర్ట్స్ నెట్, ఆర్టిఫిషియల్ టర్ఫ్, పారాచూట్ ఫాబ్రిక్స్, టెంట్స్, స్విమ్మింగ్ దుస్తులు.
అగ్రో టెక్ లో షేడ్ నెట్స్, ఫిషింగ్ నెట్స్, మల్స్ మ్యాట్స్, వడగళ్ల నిరోధక నెట్స్ (యాంటీ హెయిల్ నెట్స్) బిల్డ్ టెక్: కాటన్ కాన్వాస్ టార్పాలిన్లు, ఫ్లోర్ మరియు వాల్ కవరింగ్స్, కానోపీలు. క్లాత్ టెక్ లో జిప్ ఫాస్టెనర్లు, దుస్తులు, షూ లేసులు. జియోటెక్ లో జియోగ్రిడ్లు, జియోనెట్స్, జియోకంపోజిట్స్ హోమ్ టెక్ లో మ్యాట్రీస్ మరియు తలదిండుల్లో వాడే దూది, బ్లైండ్స్, కార్పెట్స్. ఇండ్యూటెక్ లో కన్వేయర్ బోల్ట్స్, వెహికల్ సీటు బెల్ట్స్, బోల్టింగ్ క్లాత్.
దేశంలో టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో, నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ (NTTM) 2020-21 నుండి 2025-26 వరకు రూ1,480 కోట్ల వ్యయంతో ప్రారంభించబడింది. NTTMలో రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్; ప్రమోషన్ అండ్ మార్కెట్ డెవలప్మెంట్; ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్; ఎడ్యుకేషన్, ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి నాలుగు భాగాలుంటాయి. రూ. 509 కోట్ల విలువైన 168 పరిశోధన ప్రాజెక్టులకు మద్దతునిస్తుంది. NTTM టెక్నికల్ టెక్స్ టైల్స్ 50,000 మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.